శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 07, 2020 , 01:05:42

ప్రొఫె‘సర్‌' జోహార్‌..

ప్రొఫె‘సర్‌' జోహార్‌..

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌  పట్టణంతో పాటు మండలంలోని  పలు  గ్రామాల్లో ప్రొఫెసర్‌  జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీదేవి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అరుంధతి, ఘనపూర్‌లో ఎంపీపీ గడ్డి స్వప్నవెంకటేశ్‌యాదవ్‌, ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో సర్పంచ్‌ మహాదేవి, మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.   

రామాయంపేటలో...

రామాయంపేట : రామాయంపేట పట్టణంలో  జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.  రాయిలాపూర్‌, పర్వతాపూర్‌,  కోనాపూర్‌, ఆర్‌.వెంకటాపూర్‌, ఝాన్సీలింగాపూర్‌ తదితర గ్రామాల్లో  సార్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.  ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీవో గిరిజారాణి, గాంధీ, సాయి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బోయిని దయాలక్ష్మి, భూమగారి నర్సాగౌడ్‌, బుజ్జి దేవేందర్‌ పాల్గొన్నారు. 

వెల్దుర్తిలో...

వెల్దుర్తి : వెల్దుర్తిలో తహసీల్దార్‌ కార్యాలయంవద్ద ఆర్‌ఐ ధన్‌సింగ్‌ ఆధ్వర్యంలో   వీఆర్వోలు, సిబ్బంది జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి జయశంకర్‌సార్‌ సేవలను కొనియాడారు.

నిజాంపేటలో...

నిజాంపేట : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం జయశంకర్‌సార్‌ చేసిన కృషిని మరువలేమన్నారు. అనంతరం జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.    ఎంపీవో రాజేందర్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంపత్‌, నందిగామ సర్పంచ్‌ ప్రీతి, మండల ఎంపీటీసీలు లహరి, బాల్‌రెడ్డి, సురేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

చిలిపిచెడ్‌లో...

చిలిపిచెడ్‌ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం చిలిపిచెడ్‌లో తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అబ్దుల్‌సత్తార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, అలాగే అంతారం గ్రామంలో గ్రామ కార్యదర్శి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

మెదక్‌ :  తెలంగాణ రాష్ట్ర సాధనకు  పాటుపడిన ప్రొఫెసర్‌ ఆచార్య జయశంకర్‌ సార్‌ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అని, ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. గురువారం జయశంకర్‌ సార్‌ జయంతిని పురస్కరించుకొని  కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో...

ప్రొఫెసర్‌  జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.  జడ్పీ సీఈవో లక్ష్మీబాయి సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.  జడ్పీ సూపరింటెండెంట్‌ జమ్లానాయక్‌,  సిబ్బంది పాల్గొన్నారు.

అందరికీ ఆదర్శ ప్రాయుడు...

  జయశంకర్‌ సార్‌ అందరికీ ఆదర్శ ప్రాయుడని టీఆర్‌ఎస్‌ మెదక్‌ పట్టణ అధ్యక్షుడు మందుగుల గంగాధర్‌ అన్నారు.  మెదక్‌ టీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో సార్‌ జయంతి వేడుకలను  నిర్వహించారు.మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి,  కౌన్సిలర్లు సమీయొద్దీన్‌, జయరాజ్‌, టీఆర్‌ఎస్‌ పట్ణణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌, జీవన్‌రావు పాల్గొన్నారు. 

 టేక్మాల్‌ మండలంలో...

టేక్మాల్‌ :  జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను టేక్మాల్‌ మండలంలో ఘనంగా నిర్వహించుకున్నారు. టేక్మాల్‌ చౌరస్తాలోని జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.        

 అల్లాదుర్గంలో  

అల్లాదుర్గం:  జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.    

పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేటల్లో

పెద్దశంకరంపేట : పెద్దశంకరంపేటలో జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నశంకరంపేటలోని తహసీల్దార్‌, ఎంపీడీవో  కార్యాలయాల్లో  సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.logo