బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Aug 07, 2020 , 01:00:58

ఉద్యమ నాయకుడు రామలింగారెడ్డికి నివాళి

ఉద్యమ నాయకుడు రామలింగారెడ్డికి నివాళి

రామాయంపేట: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి తీరని లోటని రామాయంపేట  మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌ గౌడ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, పట్టణాధ్యక్షుడు పుట్టి యాదగిరి, ఆత్మకమిటీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, సరాఫ్‌ యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రం, దేమె యాదగిరి అన్నారు. మండలంలోని అక్కన్నపేట గ్రామంలో  టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామకమిటీ చైర్మన్‌ చిట్టిమల్లి నరేందర్‌రెడ్డి, శ్రీ కాంత్‌సాగర్‌, యాదగిరి, గంగాధర్‌, రాజు, శ్రీను, వంశీ, రవి, పవన్‌లు రామలింగారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. రామాయంపేట ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ నాయకులు డీజీ శ్రీనివాసశర్మ, మాజీ మండల అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ, అమరేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కట్ట ప్ర భాకర్‌, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, ఊడెం దేవరాజు, రాగిలింగం తదితరులు రామలింగారెడ్డికి నివాళులర్పించారు. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర

 తూప్రాన్‌ రూరల్‌ :  దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల రాష్ట్ర ఫుడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ  చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు.  తూప్రాన్‌ పట్టణ శివారులోని పోతరాజుపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల పక్షాన జర్నలిస్టుగా పలు కథనాలను రాశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు.  రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం  చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ తూప్రాన్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, వడ్ల నారాయణ ఉన్నారు. 

చేగుంట, నార్సింగి మండలాల్లో  

చేగుంట : చేగుంట,నార్సింగి మండలాల్లో ప్రజలు, నాయకులు రామలింగారెడ్డికి నివాళులర్పించారు.  చేగుంట గాంధీ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు ఆధ్వర్యంలో, విశ్రాంతా ఉద్యోగుల కార్యాలయం వద్ద, పొలంపల్లి, కర్నాల్‌పల్లి, వడియారం గ్రామాల్లో  రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

తీరని లోటు

వెల్దుర్తి :  ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తీరని లోటని ఎంపీపీ స్వరూపనరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల వెంట నడిచిన మహనీయుడు రామలింగారెడ్డి అన్నారు.  రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కౌడిపల్లి ప్రెస్‌క్లబ్‌ సభ్యుల నివాళి

కౌడిపల్లి : దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి  మృతికి సంతాపంగా కౌడిపల్లి ప్రెస్‌క్లబ్‌ సభ్యులు  ఘనంగా నివాళులర్పించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు అంపటి సంతోశ్‌ మాట్లాడుతూ రామలింగారెడ్డి మృతి తీరని లోటన్నారు. అనుక్షణం పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.  జర్నలిస్టుగా సమాజానికి విశేష సేవలు అందించిన రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ సభ్యులు మనోహర్‌ గౌడ్‌, పెంటయ్య, మల్లేశం, రవిగౌడ్‌, ప్రశాంత్‌, అన్వర్‌, కుమార్‌  పాల్గొన్నారు. logo