మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Aug 05, 2020 , 23:56:45

మెదక్‌లో భువన్‌యాప్‌ సర్వే ప్రారంభం

  మెదక్‌లో భువన్‌యాప్‌ సర్వే ప్రారంభం

  •  మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి
  •   భవనాల కొలతలను తీస్తున్న     మున్సిపల్‌ అధికారులు

మెదక్‌ : మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే భువన్‌ యాప్‌ సర్వేను మెదక్‌ పట్టణంలో బుధవారం ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో భవనాలకు సంబంధించిన కొలతలను తీస్తున్నారు. 

   ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటిని భువన్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఆస్తి పన్ను ఎంత ఉంది.. ఇప్పుడు ఎంత వస్తుంది.. ఇలా ప్రతి ఇంటి వివరాలను నమోదు చేస్తామన్నారు.  దుకాణం ఉంటే  ట్రేడ్‌ లైసెన్స్‌ ఉండాలని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరో వార్డులో మొక్కలు నాటిన మున్సిపల్‌ కమిషనర్‌..

హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్‌ పట్టణంలోని ఆరో వార్డులో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్‌ పట్టణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటుతున్నామన్నారు. మొక్కలకు నీటి సరఫరా కోసం ట్యాం కర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటాలని సూచించారు. logo