ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Medak - Aug 05, 2020 , 00:20:53

సింగూరు ప్రాజెక్టులో 2.012 టీఎంసీల నీటి నిల్వ

సింగూరు ప్రాజెక్టులో 2.012 టీఎంసీల నీటి నిల్వ

పుల్కల్‌ : సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ భాగంలో పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు డ్యాంలోకి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి రెండు టీఎంసీల నీరు చేరిందని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 512.785 మీటర్లకు 2.012 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాంలోకి మంగళవారం 389 క్యూసెక్కుల వరద నీరు చేరగా, మిషన్‌ భగీరథకు 25 క్యూసెక్కుల నీటిని కేటాయించగా, 75 క్యూసెక్కులు ఆవిరి అవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.


logo