సోమవారం 28 సెప్టెంబర్ 2020
Medak - Aug 05, 2020 , 00:21:09

కరోనా భయంతో ‘తహసీల్దార్‌ కార్యాలయం’ మూసివేత

కరోనా భయంతో  ‘తహసీల్దార్‌ కార్యాలయం’ మూసివేత

మద్దూరు : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం అధికారులు మూసివేశారు. అయితే, కార్యాలయం తలుపులు మూసి, లోపల రెవెన్యూ ఉద్యోగులు విధులను నిర్వర్తించారు. ప్రధానంగా సందర్శకులు పెద్ద ఎత్తున కార్యాలయానికి వస్తుండడంతో.. వారి తాకిడిని తగ్గించేందుకు అధికారులు కార్యాలయాన్ని మూసివేసినట్లు తెలిసింది. అత్యవసర పనులపై కార్యాలయానికి వచ్చే సందర్శకులతో ఉద్యోగులు లోపల నుంచే మాట్లాడి పంపిస్తున్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలో వేసి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ నరేందర్‌ మాట్లాడుతూ.. కొంతమంది పనులు లేకపోయినా కార్యాలయానికి వస్తున్నట్లు తెలిపారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు గుమ్మం దగ్గర అటెండర్‌ను పెట్టి అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. 


logo