శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Medak - Aug 04, 2020 , 23:55:59

ఇమ్యూనిటీ పవరే వ్యాక్సిన్‌

ఇమ్యూనిటీ పవరే వ్యాక్సిన్‌

  • n సంప్రదాయ  ఆహారం ఔషధమే..
  • n ఎండతో విటమిన్‌-డీ లభ్యం
  • n ఆశావాహ దృక్పథమే  కరోనాపై  విజయానికి సూత్రం
  • n వైరస్‌ను తట్టుకునే శక్తిని  ఇస్తున్న వ్యాయామాలు
  • n పారిశ్రామికవాడలో  కోలుకుంటున్న 99శాతం మంది కార్మికులు

పటాన్‌చెరు : ఎక్కడ చూసినా.. ఇప్పుడు కరోనా వైరస్‌ పేరే వినిపిస్తున్నది. కరోనాను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది తమవంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రజలకు మాత్రం భౌతిక దూరం పాటిస్తూ, మార్కెట్‌లోకి వస్తే మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా సోకకుండా, సోకితే ఇమ్యూనిటీ పవర్‌ను ఎలా పెంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా చికిత్సలో కీలకమైన ఔషధం మనలోనే ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే “ఇమ్యూనిటీ పవర్‌”. ఎవరిలో ఎంత ఇమ్యూనిటీ పవర్‌ ఉంటుందో వారి ఆరోగ్యాలకు అంతగా భరోసా ఉంది. ఇమ్యూనిటీ విషయంలో పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని కార్మికులు నిరంతరం శారీరక శ్రమకు దగ్గరగా ఉండటం.. ఔషధం లాంటి ఆహారపు అలవాట్లు పెంచుకోవడంతో వారికి త్వరగా నెగెటివ్‌ వచ్చేలా చేస్తున్నది. దాదాపుగా 99 శాతం కార్మికులు వైరస్‌ను జయిస్తున్నారు. సమృద్ధిగా పండ్లు అందుబాటులో ఉండడంతో పాటు చికెన్‌, మటన్‌ వంటి పౌష్టికాహారం వినియోగం పెరుగడంతో కార్మికులు మంచి ఇమ్యూనిటీ పవర్‌ను సాధిస్తున్నారు. 

సంప్రదాయ ఆహారం.. 

మన ఆహారం ఔషధగుణాలతో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పసుపు, అల్లం, షొంఠి, మిరియాలు, లవంగం, దాల్చిని చెక్క, నిమ్మకాయ వంటి దినుసులు మన వంటల్లో వాడుతుండడంతో ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండడంతో అన్ని రాష్ర్టాల ఆహారపు అలవాట్లు ఇక్కడ మనం చూడవచ్చు. పసులు, అల్లం, షొంఠి, మిరియాలతో చేసుకుంటున్న కాడ ఇప్పుడు అన్ని రాష్ర్టాల ప్రజలు వినియోగిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకు కూడా దవాఖానల్లో కాడను అందిస్తున్నారు. కాడ వినియోగం పెరుగడంతో ప్రజల్లో మంచి ఇమ్యూనిటీ పవర్‌ వస్తుంది. కరోనా సమయంలో (సీ) విటమిన్‌  ఎక్కువగా తీసుకోవాలని చెబుతుండడంతో ప్రజలు పండ్ల వినియోగాన్ని పెంచారు. (సీ) విటమిన్‌ ఎక్కువగా ఉండే బత్తాయి, నారింజ, జామ, పైనాపిల్‌, ద్రాక్ష, కిస్మిస్‌, ఉసిరి వంటి పండ్లను జ్యూస్‌ల రూపంలో తీసుకుంటున్నారు. ఒక స్థాయిలో ఆర్థికంగా స్థిరపడ్డవారు బాదం, పిస్తా, కాజు, అంజీర్‌, కిస్మిస్‌, అక్రోట్‌ వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటున్నారు. అలాగే చికెన్‌, మటన్‌, చేపలతో వచ్చే బలంతో కరోనాను జయించవచ్చని వైద్యాధికారులు తెలుపుతున్నారు. 

వ్యాయామంతో రక్షణ..  

లాక్‌డౌన్‌ టైంలో ఇండ్లల్లో ఉండడానికి అలవాటు పడిన ప్రజలు వ్యాయామంపై ఆసక్తి పెంచుకున్నారు. చక్కటి రోగనిరోధక శక్తి కోసం వ్యాయామం తప్పని సరి అని వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలను ప్రజలు ఆచరిస్తున్నారు. యోగా, మెడిటేషన్‌తో పాటు నడక, జాగింగ్‌కు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిమ్‌లు నాలుగు నెలలుగా మూతపడడంతో యువత కూడా ఇండ్లల్లోనే జిమ్‌ సామగ్రిని సమకూర్చుకుని వ్యాయామాలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో గతంలో కంటే ఎక్కువ మంది వాకింగ్‌ ట్రాక్‌లపై కనిపిస్తున్నారు. మహిళలు, పిల్లలు కూడా స్కిప్పింగ్‌, వాకింగ్‌, యోగాలు చేస్తున్నారు. ఏ మందు లేని కరోనాపై శారీరక దృఢత్వమే పరమ ఔషధమని గుర్తిస్తున్నారు. పారిశ్రామికవాడలోని ప్రజల్లో అధికంగా కార్మికులే ఉన్నారు. వారికి పరిశ్రమల్లో చేతి నిండా పని దొరుకడంతో అలసిపోయేంత శారీరక శ్రమ కలుగుతున్నది. పాజిటివ్‌ సోకిన కార్మికులు తక్కువ సమయంలోనే రికవరీ అవుతున్నారు. నియోజకవర్గంలో వ్యవసాయ పనులు ఉపందుకున్నందున రైతులు, కూలీలు కూడా కరోనాపై తెలిగ్గానే విజయం సాధిస్తున్నారు. మాస్క్‌లు, భౌతిక దూరం పాటిస్తే కరోనా దరిచేరదు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల అలవాట్లు వారికి రక్షణ కల్పిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అరగంట నుంచి గంట సేపు వ్యాయామాలు, క్రీడలు, యోగా, మెడిటేషన్లకు ప్రాధాన్యత ఇస్తూ పౌష్టికాహారం తింటే వారికి ఏ వ్యాక్సిన్‌ అవసరం లేదన్నది సత్యం. logo