శనివారం 08 ఆగస్టు 2020
Medak - Aug 02, 2020 , 00:06:44

మంచి ఫలితాలు సాధించాలి

మంచి ఫలితాలు సాధించాలి

రామాయంపేట: విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఉందని, విద్యార్థులు చక్కగా చదివి   ఉన్నత శిఖరాలకు ఎదుగాలని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి అన్నారు. శనివారం మండల పరిధిలోని కోనాపూర్‌ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు  పాఠ్య పుస్తకాలు అందజేసి మాట్లాడారు.   ప్రభుత్వం   అందజేస్తున్న పుస్తకాలను విద్యార్థులు శ్రద్ధగా చదివి  మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఝాన్సీలింగాపూర్‌  ఉన్నత పాఠశాల విద్యార్థులకు  సర్పంచ్‌ పంబాల జ్యోతి, ఉపసర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి  చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలను అందజేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌లు దోమ చంద్రకళ, ఉపసర్పంచ్‌ దీపక్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎంలు ఐరేని రవీందర్‌గౌడ్‌, యాదగిరి, కార్యదర్శి మురళి, ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలి 

చేగుంట:  కరోనా వైరస్‌  నేపథ్యంలో  విద్యార్థులు ఇంటి వద్దనే  చదువుకోవాలని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ కోరారు.  చేగుంటలోని ఆదర్శ పాఠశాల, కర్నాల్‌పల్లి, పొలంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఆయన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు.  కార్యక్రమంలోప్రిన్సిపాల్‌ భూపాల్‌రెడ్డి, సీహెచ్‌ సత్యనారాయణ, కర్రె సిద్ధిరాములు, సర్పంచ్‌లు సంతురెడ్డి, ఎన్నెలి నిర్మల సత్యం, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు హరిదాస్‌, గోవింద్‌, కృష్ణ, ఉపాధ్యాయులు రాజశేఖర్‌రెడ్డి, కవిత, సంపత్‌ ఉన్నారు.

పాఠ్యపుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలి

చిలిపిచెడ్‌: పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వినోదదుర్గారెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విఠల్‌తో కలిసి శనివారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏటిగడ్డమాందాపూర్‌లో పాఠ్య పుస్తకాలు పంపిణీ

కొల్చారం: ఏటిగడ్డమాందాపూర్‌లో విద్యార్థులకు సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి  గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు.


logo