ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 00:33:02

గజ్వేల్‌ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గజ్వేల్‌ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మనోహరాబాద్‌ : గజ్వేల్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు గడా కార్యాలయ ప్రత్యేక అధికారి యతీశ్‌కుమార్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలోని పలు కాలనీల్లో తిరిగి పరిశీలించారు. అనంతరం ఎంపీపీ పురం నవనీతరవితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుధ్యం లోపించకుండా చూడాలన్నారు. హరితహారం మొక్కలను ప్రతి ఇంటి ఆవరణలో నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నత్తి లావణ్య, ఇన్‌చార్జ్జి సర్పంచ్‌ కాళిదాస్‌, నాయకుడు నత్తి మల్లేశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  


logo