సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 00:02:53

దిగువ చెరువులకు నల్లవాగు ప్రాజెక్టు నీళ్లు

దిగువ చెరువులకు నల్లవాగు ప్రాజెక్టు నీళ్లు

సిర్గాపూర్‌ : నల్లవాగు ప్రాజెక్టుకు దిగువన చెరువులు నింపేందుకు గాను ప్రాజెక్టు నీటిని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి బుధవారం తూము ద్వారా విడుదల చేశారు. అంతకుముందు గంగమ్మ తల్లికి పూజలు చేసి ప్రాజెక్టు నీటిలో ఎమ్మెల్యే తెప్ప వదిలారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం చేరి అలుగు పారుతోంది. ప్రాజెక్టు కుడి కాల్వ కింద కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో 4100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పరీవాహక ప్రాంతంలోని మొత్తం 9 చెరువులకు ప్రాజెక్టు నీరును వదిలేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. అలుగు ద్వారా దిగువకు నీరు వృథాగా ప్రవహిస్తున్న దృష్ట్యా, రైతులకు ఉపయోగపడే చెరువులను నింపితే వరి నాట్లకు ఎంతో ప్రయోజనమని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,048 క్యూసెక్కుల వరద నీరు ఉండగా, 12,048 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో అవుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 కాగా, ప్రస్తుతం 1495 అడుగుల నీటిమట్టం ఉందని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు రాఘవరెడ్డి, నర్సింహారెడ్డి, డీఈఈ జలంధర్‌, ఏఈలు సూర్యకాంత్‌, రవి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు ఉన్నారు. 


logo