గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 00:02:54

వరద హోరు..

వరద హోరు..

  • l  సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి   నుంచి బుధవారం సాయంత్రం వరకు   పలుచోట్ల భారీ వర్షం
  • l  పొంగిపొర్లిన చెరువులు, కుంటలు
  • l  జలకళను సంతరించుకున్న  మంజీరా నది
  • l  నల్లవాగు ప్రాజెక్టులోకి 5,336    క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • l  సింగూర్‌ ప్రాజెక్టులోకి   6.300 క్యూసెక్కుల వరద..

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఝరాసంగం, న్యాల్‌కల్‌, నాగల్‌గిద్ద, సిర్గాపూర్‌, నారాయణఖేడ్‌, మనూరు, వట్‌పల్లి, కంగ్టి, కల్హేర్‌, రాయికోడ్‌, మునిపల్లి మండలాల్లో భారీ వర్షం కురువడంతో చెరువులు, కుంటలు అలుగు పారుతూ జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల  రోడ్లు, ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మంజీరా నదిలోకి వరద నీరు చేరుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 5,336 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు డీఈఈ జలంధర్‌, ఏఈఈ సూర్యకాంత్‌ బుధవారం తెలిపారు. అలుగు ద్వారా 1139 క్యూసెక్కుల వరద నీరు దిగువకు పారుతున్నట్లు చెప్పారు. సింగూర్‌ ప్రాజెక్టులోకి మూడు రోజులుగా స్వల్పంగా వరద చేరుతోంది. సోమవారం 50 క్యూసెక్కులు, మంగళవారం 100క్యూసెక్కులు, బుధవారం 6,300 క్యూసెక్కుల వరద  వచ్చిందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు. దీంతో సింగూరు ప్రాజెక్టులోకి నీరు చేరడం, మంజీరా నది, నల్లవాగు అలుగు పొంగిపొర్లుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

-సంగారెడ్డి జిల్లా నెట్‌దవర్క్‌


logo