శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 28, 2020 , 22:58:09

నిరుపేదలకే ‘డబుల్‌' ఇండ్లు

 నిరుపేదలకే ‘డబుల్‌' ఇండ్లు

  • n పారదర్శకంగా   లబ్ధిదారుల ఎంపిక
  • n నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • n మున్సిపల్‌ చైర్మన్‌   రాఘవేందర్‌గౌడ్‌

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ పట్టణంలోని 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లకు అర్హులైన నిరుపేదలనుంచి నేడు (బుధవారం) నుంచి ఆగస్టు 5వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ చెప్పారు.   మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం   కౌ న్సిలర్లు మామిడి వెంకటేశ్‌, శ్రీశైలంగౌడ్‌, మామిండ్ల జ్యోతికృష్ణ, కుమ్మరి రఘుపతి, దుర్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 16 వార్డులోని నిరుపేదలకు దరఖాస్తు పత్రాలు ఉచితంగానే అందజేస్తామన్నారు.   జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలురు)లో 4, బాలికల పాఠశాలలో 4 కౌంటర్ల వం తున 8 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి కౌం టర్‌లో రెండు వార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు   స్వీకరిస్తామన్నారు.  ఇండ్లు ఉన్నా, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్న వారు సైతం అనర్హులన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా కొనసాగుతుందని,  ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు. దరఖాస్తు పత్రంతోపాటు ఆధార్‌కార్డు, స్థానిక నివాస, రేషన్‌కార్డు జిరాక్స్‌ పత్రాలు   సమర్పించాలన్నారు.  నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్లను కేటాయించాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. 

తాజావార్తలు