గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jul 26, 2020 , 22:40:40

వనదుర్గా భవానీ మాతకు ప్రత్యేక పూజలు

వనదుర్గా భవానీ మాతకు ప్రత్యేక పూజలు

పాపన్నపేట :  పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రావణమాసంలో భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండటం మూలంగా ఏడుపాయలలో భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొవిడ్‌- 19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేద బ్రాహ్మణులు శంకర్‌శర్మ, నరసింహాచారి, పార్థీవశర్మతో పాటు ఏడుపాయల ఉత్సవ కమిటీ సభ్యులు సాయిరెడ్డి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌, సిబ్బంది సూర్యశ్రీనివాస్‌, ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌శర్మ అన్ని ఏర్పాటు చేశారు. 


logo