ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 26, 2020 , 22:28:03

గంగమ్మ గలగలలు..!

గంగమ్మ గలగలలు..!

ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నీటి వనరులన్నీ గలగలా పారుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతుండటంతో, చెక్‌డ్యామ్‌లు మత్తడి దుంకుతున్నాయి. నంగునూరు మండల పరిధిలోని అక్కెనపల్లి పెద్ద వాగుపై గల చెక్‌ డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి. అక్కన్నపేట మండల పరిధిలోని చౌటపల్లి కొత్త చింత చెరువుకు జలకళ సంతరించుకోగా, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో ప్రవహించే కూడవెళ్లి వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌లు, వెల్దుర్తి మండల పరిధిలోని హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌లు అలుగుపారుతున్నాయి. కోహెడ మండల పరిధిలోని మోయతుమ్మెద వాగు, బస్వాపూర్‌ ఎగువ ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌లు మత్తడి దూకుతున్నాయి. బస్వాపూర్‌ బ్రిడ్జి వద్ద సమాంతరంగా నీరు కిందికి వెళ్లి అటు శనిగరం ఇటు సింగరాయ ప్రాజెక్టులోకి వరద నీరు వెళుతోంది. మద్దూరు మండల పరిధిలోని కమలాయపల్లి చెరువుకు జలకళ సంతరించుకున్నది. జల వనరుల్లో నీటి సవ్వడులు చేయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంతో పొలం పనులు చేసుకుంటున్నారు. -నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌


logo