బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jul 26, 2020 , 02:03:01

ప్రతి హోటల్‌లో వేడి తాగునీరు పెట్టాలి

ప్రతి హోటల్‌లో  	వేడి తాగునీరు పెట్టాలి

  • n పట్టణంలో నాలుగు చోట్ల కషాయం.. వేడి నీటి కేంద్రాలు
  • n రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • n హోం ఐసొలేషన్‌ బాధితులకు కొవిడ్‌ కిట్ల పంపిణీ 
  • n ముస్తాబాద్‌ చౌరస్తాలో ఉచిత కషాయ వితరణ కేంద్రం ప్రారంభం
  • n పలు కార్యక్రమాలకు హాజరు

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘కషాయం.. వేడి నీళ్లు తా గుదాం.. ప్రభుత్వ సూచనలు పాటించి కరోనాను తరుముదాం.. కొవిడ్‌-19ను జయిద్దాం’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ప్రజల సౌకర్యా ర్థం మంత్రి సొంత ఖర్చులతో కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి మున్సిపల్‌ కార్యాలయంలో కరోనా కిట్లను పంపిణీ చేశారు. మంత్రి నివాసంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఏరియా దవాఖాన వైద్య సిబ్బంది కోసం మొత్తం 400 ఫేస్‌ షీల్డ్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల కోసం ఉచితంగా కషాయం, వేడి తాగునీరు అందించేలా నాలుగు చోట్ల కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కరోనా అంటే భయం వద్దని, అలా అని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. సిద్దిపేటలో 100 పడకల కొవిడ్‌, గజ్వేల్‌ ఆర్వీఎం దవాఖానలో 100 పడకలు, సంగారెడ్డిలోని ఎంఎన్‌ దవాఖానలో 100 పడకలతో కరోనా చికిత్స కోసం దవాఖానలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

పేదలకు సీఎం సహాయనిధి వరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల 57 వేల 100 సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదన్నారు.  

వీధి వ్యాపారులకు రుణ మంజూరు పత్రాలు

కరోనాతో చాలా మంది వీధి వ్యాపారుల వ్యాపారం దెబ్బతిందని, రెక్కాడితే డొక్కాడని వీధి వ్యాపారులు ఇబ్బందులు పడొద్దని రూ.10 వేల రుణాన్ని అందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి విక్రయ వ్యాపారులకు రుణ మంజూరు పత్రాలు, కరోనా పాజిటివ్‌ రోగులకు కొవిడ్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. వీధి వ్యాపారులు వడ్డీ వ్యాపారుల వద్ద మిత్తిలకు పోవద్దని, 7 శాతం వడ్డీతో రూ.10 వేల రుణాలను ఇస్తున్నామన్నారు. ప్రతి నెలా వెయ్యి చొప్పున చెల్లించి సక్రమంగా డబ్బులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, ప్రభాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు

టీఎన్జీవో జిల్లా శాఖ అందించిన మాస్కులను మున్సిపల్‌ కార్మికులకు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఉద్యోగుల సమస్యలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో టీఎన్‌జీవోలు పాల్గొనడం సంతోషకరమని మంత్రి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌, కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింలు, జిల్లా సహ అధ్యక్షుడు నిమ్మ సురేందర్‌రెడ్డి, జిల్లా కోశాధికారి అశ్వాక్‌ అహ్మద్‌, నాయకులు పాల్గొన్నారు.

ఎన్జీవో కమ్యూనిటీ హాల్‌ను జ్ఞాన, యోగా కేంద్రంగా మార్చాలి 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట ఎన్జీవో కమ్యూనిటీ హాల్‌ను జ్ఞాన, యోగా కేంద్రంగా మార్చాలని, ఎన్జీవో కాలనీ ఇతర కాలనీలకు దిక్సూచిగా, ఆదర్శంగా నిలువాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట ఎన్జీవో కాలనీలో కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ అమెరికా, జపాన్‌, జర్మనీ దేశాల్లో మన దేశాన్ని ఫాలో అవుతూ యోగా చేస్తున్నాయన్నారు. సిద్దిపేట ఆదర్శంగా నిలిచేలా చెట్లను పెంచి గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ సిద్దిపేటకు సహకరించాలన్నారు.

రాజమల్లయ్య విగ్రహ ఆవిష్కరణ 

సిద్దిపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చొప్పదండి రాజమల్లయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమల్లయ్య సేవలను మంత్రి కొనియాడారు. రాజమల్లయ్య మున్సిపాలిటీకి అందించిన సేవలను మరువలేనివన్నారు. 

ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌, 

బార్‌ అసోసియేషన్‌ భవనాల ప్రారంభం 

సిద్దిపేటలో తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్‌, బార్‌ అసోసియేషన్‌ భవనాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి మాట్లాడారు. ఈ భవనం సంక్షేమ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడాలన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తున్నామన్నారు. భవనాలు నిర్మించడం గొప్ప కాదని, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం గొప్ప అన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు భవనం నిర్మించామని, ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తామన్నారు.

పంచాయతీరాజ్‌ కార్యాలయం ప్రారంభం

సిద్దిపేట పట్టణంలో పంచాయతీ రాజ్‌ ఈఈ కార్యాలయ భవనాన్ని జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ కనకరత్నం, డీఈ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 

కరోనా బాధితులకు ఆక్సిజన్‌, కషాయం పంపిణీ 

సిద్దిపేట ఎస్సెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ సేవక్‌ ఎండీ ఫయాజ్‌ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమంతో పాటు ఉచితంగా ఆక్సిజన్‌, కషాయం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కరోనా బాధితులను వీటిని పంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ అని తేలితే తెలంగాణ సేవక్‌ను సంప్రదించాలన్నారు. ఆక్సిజన్‌, కషాయం ఉచితంగా అందజేస్తామన్నారు.


logo