శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 26, 2020 , 02:03:13

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

మెదక్‌ /మెదక్‌ రూరల్‌ /అల్లాదుర్గం/చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/మెదక్‌ టౌన్‌  : నాగుల పంచమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం నుంచే నాగదేవతకు పుట్టలో పాలు పోసేందుకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు తరలివచ్చారు. మెదక్‌ పట్టణంలోని మల్లంచెరువు కట్టపై నాగదేవతకు మహిళలు పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు.

పేరూర్‌ సరస్వతీ ఆలయంలో..

పేరూర్‌ సరస్వతీ ఆలయంలో నాగదేవతకు మహిళలు పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి పుట్టలో పాలు పోశారు. అల్లాదుర్గం, రేగోడ్‌ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పూజలు చేశారు. చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలంలోని నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు.

వేంకటేశ్వర ఆలయంలో పల్లకీ సేవ

నాగుల పంచమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్‌ పాల్గొన్నారు.