శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 25, 2020 , 01:28:21

రాష్ర్టాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రాష్ర్టాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  •  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

తూప్రాన్‌ రూరల్‌ : రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు నిర్విరామంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, పట్టణ కౌన్సిలర్లతో కలిసి ఆయన కేక్‌కట్‌ చేశారు. అనంతరం మొక్కలు నాటి వాటికి నీటిని పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 210 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు చెప్పారు.  తూప్రాన్‌ పట్టణంలోని 16 వార్డుల్లో 16 వేల మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలందరిపై  ఉందన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, ఉమాసత్యలింగం, శ్రీశైలంగౌడ్‌, కుమ్మరి రఘుపతి, జ్యోతికృష్ణ, రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సతీశ్‌చారి, అజార్‌, సమీర్‌, కృష్ణ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

మనోహరాబాద్‌ : మండలంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ మొక్కలను నాటి, ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ నత్తి లావణ్య ముదిరాజ్‌, రైతు బంధు మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, కాళ్లకల్‌ ఇన్‌చార్జి సర్పంచ్‌ కాళిదాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్‌ పాల్గొన్నారు. 

రామాయంపేటలో..

రామాయంపేట: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ రామాయంపేటలో పారిశుధ్య కార్మికులకు, ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, ఆహార పదార్థాలను అందజేశారు. అయ్యప్ప దేవాలయం వద్ద మొక్కలు నాటారు. పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్‌ దేమె యాదగిరితో కలిసి పట్టణంలో నిరుపేద కుటుంబాలకు 300 మందికి ఆహార పదార్థాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ సరాఫ్‌ యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రం, పుట్టి యాదగిరి, కౌన్సిలర్లు యాదగిరి, గజవాడ నాగరాజు, గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రపు కొండల్‌రెడ్డి, సరాఫ్‌ శ్యామ్‌, దేవుని రాజు, ఐలయ్య, నర్సింహులు పాల్గొన్నారు.

నిజాంపేటలో..

నిజాంపేట: నిజాంపేటలోని జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ స్వగృహంలో శుక్రవారం మండల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు  మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కో- ఆర్డినేటర్‌ సంపత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌, స్వామి,శివ పాల్గొన్నారు. 

పుస్తె మట్టెల అందజేత 

మనోహరాబాద్‌ : మంత్రి తారకరామారావు జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ర్యాకల కృష్ణాగౌడ్‌ ఓ వధువు వివాహానికి పుస్తె, మట్టెలను అందజేశారు.  రాష్ర్టాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

 ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

మనోహరాబాద్‌ : మంత్రి తారకరామారావు జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ర్యాకల కృష్ణాగౌడ్‌ ఓ వధువు వివాహానికి పుస్తె, మట్టెలను అందజేశారు.