బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jul 24, 2020 , 01:13:27

పాలనా సౌలభ్యం కోసమే విభజన

 పాలనా సౌలభ్యం కోసమే విభజన

పుల్కల్‌ :  పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్తగా జిల్లాలను, డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేశామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం అందోల్‌-జోగిపేట రెవెన్యూ డివిజన్‌లోని చౌటకూర్‌ కొత్త మండలాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త  జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను పెంచారని తెలిపారు. జాతీయ రహదారిపై 14 రెవెన్యూ గ్రామాలతో ఏర్పడిన చౌటకూర్‌ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశించారు. కొత్త మండలం అభివృద్ధ్దికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మండలాన్ని ప్రారంభించిన అనంతరం కొత్త తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ను చాంబర్‌లోని సీటుపై కూర్చోబెట్టి బాధ్యతలను అప్పగించారు. డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, రైతువేదికలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ పటోల్ల మంజుశ్రీ జైపాల్‌ రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, కలెక్టర్‌ హనుమంతరావు, ఆర్డీవోలు రవి, నగేశ్‌, పుల్కల్‌ ఎంపీపీ పటోల్ల చైతన్య విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, పుల్కల్‌ రైతుబంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జోగిపేట ఆత్మ కమిటీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, సీడీసీ డైరెక్టర్‌ జైపాల్‌ నాయక్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌చారి, సరిత, మాణిక్‌రెడ్డి, సర్పంచ్‌లు వీరమణి, మాణేయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేశ్‌బాబు, గోవర్దన్‌, వీరారెడ్డి పాల్గ్గొన్నారు. 


logo