శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jul 24, 2020 , 01:03:54

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

వెల్దుర్తి : వైద్యఖర్చులు భరించలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం వెల్దుర్తి పట్టణ శివారు నర్సాపూర్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  లక్షలాది మంది నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తుందనారు.  వెల్దుర్తి పట్టణ, మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, పెట్రోల్‌బంక్‌ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రతాప్‌రెడ్డి, స్టేషన్‌శ్రీను, కృష్ణాగౌడ్‌, వేణుగోపాల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో..

చిలిపిచెడ్‌ : మండలంలోని చిట్కుల్‌ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను నర్సాపూర్‌లో గురువారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సోమక్కపేట సొసైటీ వైస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డికి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మాణిక్యరెడ్డిలకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిట్కుల్‌ గ్రామానికి చెందిన అంబిక, కృష్ణ దవాఖాన ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వైస్‌ చైర్మన్‌కు అందజేశారు.


logo