శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jul 21, 2020 , 22:33:51

మ‌త్స్యానందం

మ‌త్స్యానందం

ఈ వానకాలంలో మెదక్‌ జిల్లాలోని నీటి వనరుల్లో 5 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తద్వారా మత్స్యకారులకు ఉపాధి లభించనుందని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మత్స్యకారులకు ఉపాధి చూపుతున్నది. ప్రజలకు స్థానికంగా చేపలు లభించేలా కృషి చేస్తున్నది. అంతేకాకుండా వారికి సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలు, సామగ్రి అందజేస్తూ అండగా నిలుస్తున్నది. దీంతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఉచితంగా నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ దిగుమతులను తగ్గిస్తున్నది. అంతేకాకుండా మత్స్యకారులకు సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలు, చేపలు పట్టే సామగ్రి అందజేస్తూ అండగా నిలుస్తున్నది. దీంతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

 ప్రభుత్వం చెరువులు బాగుచేయడం, కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ వానకాలం సీజన్‌కు గాను నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సమృద్ధిగా వానలు కురుస్తుండడంతో చేపలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో చేపలను వదులుతామని అధికారులు తెలిపారు. మెదక్‌ జిల్లాలో 1591 చెరువులు ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు, ఘనపురం ప్రాజెక్టు, హల్దీవాగుల్లో కూడా చేప పిల్లలను పెంచనున్నారు.

జిల్లాలో 5 కోట్ల టార్గెట్‌..

మెదక్‌ జిల్లాలో 5 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల కురిసిన వానలకు జిల్లాలో చాలావరకు చెరువులు నిండాయి. చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి దొరుకనుంది. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు ఏఏ చెరువుల్లో ఎన్ని చేప పిల్లలను వదలాలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

జిల్లాలో 249 సొసైటీలు...  

జిల్లాలో 249 మత్స్యకార సొసైటీలు ఉండగా, ఇందులో 15,700 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాలే మారిపోయాయి. వారికి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తూ వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. చేపలను అమ్ముకోవడానికి ద్విచక్రవాహనాలు, లగేజీ ఆటోలతో పాటు ఇతర వస్తువులను సమకూర్చింది. గతేడాది జిల్లాలో 521 చెరువుల్లో 2.11కోట్ల చేప పిల్లలను వదిలారు. అవి ఒక్కోటి 600 గ్రాములకు వరకు పెరిగాయి. దీంతో మత్స్యకారులకు మంచి ఆదాయం సమకూరింది. 

రొయ్యల పెంపకంపై ప్రత్యేక దృష్టి...

తెలంగాణలో రొయ్యల పెంపకంపై దృష్టిసారించిన ప్రభుత్వం, మొట్టమొదటి సారిగా  అక్టోబర్‌ 2016లో మెదక్‌ జిల్లా పోచారం ప్రాజెక్టులో 6.20 లక్షల రొయ్య పిల్లలను వదిలింది. ఈసారి సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా జిల్లాలోని మత్స్యకారులకు రూ.30 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 2,962 ద్విచక్రవాహనాలు, 155 లగేజీ ఆటోలు, 24 సంచార చేపల విక్రయ వాహనాలు, 672 యూనిట్ల చేపల కిట్లతో పాటు ఇతర సామగ్రిని మత్స్యకారులకు అందజేసింది. 

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..

జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. మెదక్‌ జిల్లాలో 1591 చెరువుల్లో ఈ ఏడాది 5 కోట్ల చేపపిల్లలను వదులుతాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. మత్స్యకారులకు ఉపాధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీపై చేపల విక్రయ వాహనాలు అందజేస్తున్నది. అన్ని విధాలుగా వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తున్నది.  - శ్రీనివాస్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి logo