శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 16, 2020 , 23:15:32

అన్నదాతల అభ్యున్నతికే

అన్నదాతల అభ్యున్నతికే

  • మెదక్‌ జిల్లాలో 76 రైతువేదిక భవనాలు l ఒక్కో రైతు వేదికకు రూ. 2అన్నదాతల అభ్యున్నతికే 

రామాయంపేట : గ్రామాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అందుకు మనందరం గ్రామాభివృద్ధ్దికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. గురువారం రామాయంపేటకు విచ్చేసిన కలెక్టర్‌ వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్‌తో కలిసి  రైతు వేదిక నిర్మాణ భవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అన్న దాతల అభ్యున్నతికే రైతువేదిక భవనాలను నిర్మిస్త్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదిక భవనాలను మంజూరు చేయగా, ప్రస్తుతం 66 రైతు వేదిక భవనాల పనులు పూర్తికావచ్చాయని తెలిపారు. మరో పది రైతు వేదికలకు స్థలాలను చూశామని, త్వరలో వాటిని నిర్మిస్తామమన్నారు. వీటితో పాటు ప్రభుత్వం గ్రామానికో డంపింగ్‌యార్డు, జిల్లాలో మొత్తం 469 గ్రామాలకు గాను ఒక్కో డంపింగ్‌ యార్డుకు రూ.2.50లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలను ఆయాగ్రామాల సర్పంచ్‌లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట  ఏవో రాజ్‌ నారాయణ, తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, వీఆర్‌వోలు ప్రకాశ్‌, నాగరాజు ఉన్నారు.

  ఫర్టిలైజర్‌ దుకాణాల  ఆకస్మిక తనిఖీ 

మెదక్‌ : రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి ఫర్టిలైజర్ల దుకాణాల యజమానులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలోని ఆటోనగర్‌లో వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్‌ కంపెనీ ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని, అసలు దానిని వినియోగిస్తున్నారా లేదా ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ-పాస్‌ మిషన్‌ను ఉపయోగించకుంటే ఫర్టిలైజర్‌ దుకాణాలపై కేసులు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్‌ సూచించారు. అనంతరం దుకాణాల్లో  మం దుల నిల్వ, అమ్మకాలకు సం బంధించిన అకౌంట్లను పరిశీలించారు. రైతులకు ఫర్టిలైజర్‌ దుకాణాదారులు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌  హెచ్చరించారు. మందులకు సంబంధించిన రసీదులు తప్పకుండా ఇవ్వాలని అలా ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ వెంట  స్థానిక తహసీల్దార్‌ రవికుమార్‌ ఉన్నారు.

 వేదికలతో రైతులకు సకల సౌకర్యాలు 

 చేగుంట: రైతు వేదికల నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. మండలకేంద్రమైన చేగుంటలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనం నిర్మాణ  పనులను గురువారం  ఆయన పరిశీలించారు.  చేగుంట మండలంలో మక్కరాజిపేట, బోనాల్‌, ఇబ్రహీంపూర్‌, చందాయిపేటలో నిర్మాణ పనులపై ఆరాతీశారు. ఆయనవెంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీన్‌కుమార్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, మండల శాఖా అధ్యక్షుడు జింక శ్రీనివాస్‌, దశరథ్‌,తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఏవో భూపతి జయశంకర్‌, ఏపీఏం లక్ష్మీనర్సమ్మ, ఈవో రాణి ఉన్నారు.

నిజాంపేటలో..

నిజాంపేట : రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. గురువారం నిజాంపేటలో రైతు వేదిక పనులను ఆయన  పరిశీలించారు.  ఆగస్టు 15నాటికి డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మండల ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. అనంతరం మొక్క లు నాటారు. ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు,జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్‌, తహసీల్దార్‌ జైరాములు, ఏవో సతీశ్‌, ఏపీవో శ్రీనివాస్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ నాగిరెడ్డి, సర్పంచ్‌ అనూష, ఎంపీటీసీ లహరి, కల్వకుంట పీఏసీఎస్‌ చైర్మన్‌ అందె కొండల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ బాబు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు కిష్టారెడ్డి, అబ్దుల్‌, స్వామిగౌడ్‌, తిరుమల స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ మహేశ్‌, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.