బుధవారం 05 ఆగస్టు 2020
Medak - Jul 16, 2020 , 02:40:43

రోడ్లకు ఇరువైపులా మొక్కలు

రోడ్లకు ఇరువైపులా మొక్కలు

కొండాపూర్‌: పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఐదు విడుతల్లో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. దీంతో మండలంలోని ఆయా గ్రామాల రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఇప్పుడు ఆహ్లాదాన్ని పంచి పెడుతున్నాయి. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఆరో విడుత కార్యక్రమం కొండాపూర్‌ మండలంలో ఉత్సాహంగా సాగుతున్నది. మండల వ్యాప్తంగా 2.16 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు టార్గెట్‌ నిర్ణయించుకున్నారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో మా గ్రామం హరిత శోభను తలపిస్తుంది. ఇదంతా వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమైంది. ప్రస్తుతం గ్రామంలో ఆరో విడుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 

- షఫీ, సర్పంచ్‌ హరిదాస్‌పూర్‌, కొండాపూర్‌ మండలం


logo