మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Jul 16, 2020 , 02:40:44

పచ్చదనంగా మల్కాపూర్‌

పచ్చదనంగా  మల్కాపూర్‌

తూప్రాన్‌ రూరల్‌: మల్కాపూర్‌ అంటేనే గుర్తుకు వచ్చే విషయం కంటి వెలుగు కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘కంటి వెలుగు’ను ఇక్కడి నుంచే ప్రారంభించారు. దేశంలో ఎక్కడాలేనటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో తొలిసారిగా నిర్వహించి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు సీఎం కేసీఆర్‌. ప్రస్తుతం ఈ మల్కాపూర్‌ గ్రామంలో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఐదు విడుతల్లో నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి వృక్షాలుగా మారుతున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనువిందు చేస్తున్నది. ఐదు విడుతల్లో 4.86 లక్షల హరితహారం మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో ఏపుగా పెరిగాయి. ఈ గ్రామ రహదారులకు పచ్చని తోరణాలు కట్టినట్లుగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు దర్శనమిస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ పర్యటించి తమ గ్రామాన్ని కూడా ఇలాగే సిద్ధం చేసుకుంటామని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆరో విడుతను కూడా గ్రామంలో విజయవంతం చేస్తామని చెబుతున్నారు గ్రామస్తులు.logo