ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 23:54:25

పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం

పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం

  •  రైతు వేదిక పనులను వేగవంతం చేయాలి
  •  మెదక్‌ ఆర్డీవో సాయిరాం

హవేళిఘనపూర్‌: గ్రామస్తుల సహకారంతో సర్పంచ్‌లు, సెక్రటరీలు పరిశుభ్రత పాటిస్తూ గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మెదక్‌ ఆర్డీవో సాయి రాం అన్నారు. మంగళవారం  హవేళిఘనపూర్‌ జిల్లా పరిషత్‌ ఆవరణలో నాటిన మొక్కలు, గ్రామంలో మురికి కాల్వ లు, రైతు వేదిక నిర్మాణం, డంపింగ్‌ యార్డులను ఆయన  పరిశీలించారు. ఇదే సమయంలో పాఠశాల ఆవరణలో గ్రామానికి చెందిన సిద్ధిరాములు పశువులు  మొక్కలను మేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెం టనే సదరు యజమానికి రూ.500 జరిమానా విధించాలని సెక్రటరీ యాదగిరిని ఆదేశించారు. నాటుతున్న మొక్కలను ఎవరైనా నాశనం చేస్తే సహించబోమన్నారు.  ప్రభుత్వం రైతులందరూ కలిసి వ్యవసాయ సాగు కోసం చర్చించుకునేందుకు వీలుగా రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవాలన్న ఆదేశాల మేరకు  రైతు వేదిక నిర్మాణ పనులను ప్రారంభించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశం, ఎంపీడీవో సాయిబాబా, సర్పంచ్‌ సవితశ్రీకాంత్‌, ఉప సర్పంచ్‌ మోహన్‌గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ సవితశ్రీకాంత్‌ ఉన్నారు. 

 మెదక్‌ రూరల్‌లో

 మెదక్‌ రూరల్‌: డంపింగ్‌ యార్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఉపాధి హామీ పనుల తనిఖీ అధికారి జయదేవ్‌ పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ మండల పరిధిలోని రాయినిపల్లి, చిట్యాల గ్రామపంచాయతీ పరిధిల్లోని డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులతో పాటు నర్సరీలు, ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధిహామీ కూలీల రికార్డులను  తనఖీ చేశారు. ప్రతి రోజు ఎంత మంది కూలీ లు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధిహామీ పనులు, నర్సరీల పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధ్ది చెందాలనే లక్ష్యంతో పల్లె ప్రగతిలో  అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు జిల్లాలో మిగిలిపోయిన డంపింగ్‌ యార్డు పనులను  త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీవో ఆదినారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సిద్ధ్దాగౌడ్‌, వెంకటేశం  ఉన్నారు. 



logo