గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 23:54:36

తండాల్లో శీత్లా భవానీ వేడుకలు

తండాల్లో శీత్లా భవానీ వేడుకలు

అక్కన్నపేట/హుస్నాబాద్‌ రూరల్‌: గిరిజనుల ఆరాధ్యదైవమైన శీత్లా భవానీ వేడుకలను మంగళవారం అక్కన్నపేట మండలం బోదర్‌వాగుతండా, మంజ్యనాయక్‌తండా, పంతుల్‌తండా, చౌడుతండా, కేశనాయక్‌తండాల్లో, హుస్నాబాద్‌ మండలం వంగరామయ్యపల్లి పరిధి పూల్‌నాయక్‌తండాలో ఘనంగా నిర్వహించారు. ఏటా ఆషా ఢం నుంచి శ్రావణం వరకు ప్రతి మంగళవారం గిరిజన తండాల్లో(దాటుడు) పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో గిరిజనులు నిర్వహిస్తారు. గిరిజన మహిళలు నైవేద్యాలు నెత్తిన పెట్టుకొని గ్రామశివారులో ప్రతిష్ఠించిన శీత్లాభవానీ వద్దకు డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి, మొక్కులు చెల్లించారు. పశువులను అమ్మవారికి బలిచ్చిన జంతు పేగులపై దాటించారు. అనంతరం వర్షాలు సకాలంలో కురిసి, చెరువులు నిండి, పంటలు పండి పాడిపశువులు, పిల్లా పాపలు చల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.


logo