గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 23:54:37

చిన్నారుల పొలంబాట..

చిన్నారుల పొలంబాట..

కరోనా నేపథ్యంలో ‘బడి బాట’ బంద్‌ కావడంతో గ్రామాల్లో తల్లిదండ్రులతో పాటు చిన్నారులు ‘పొలం బాట’ పడుతున్నారు. పొలం పనుల్లో ‘మేము సైతం’ అంటూ తమ బుడిబుడి అడుగులను వడివడిగా వేస్తున్నారు. పొద్దంతా ఇంటి వద్ద ఉండలేక ఉడుత సాయంగా అమ్మనాన్నలకు చిన్నారులు పొలం పనుల్లో సాయం చేస్తున్నారు. మద్దూరు మండలం ధూళ్మిట్టలో మంగళవారం చిన్నారులు పొలం లో వరి నారును పంచుతున్న దృశ్యాలు కనిపించగా, ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది.    - మద్దూరు


logo