శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jul 14, 2020 , 03:39:21

అన్నదాత.. అభ్యున్నతికి రైతు వేదికలు

అన్నదాత.. అభ్యున్నతికి రైతు వేదికలు

  • n తడి, పొడి చెత్త వేరు చేయాలి
  • n కంపోస్టు తయారీతో పంచాయతీకి ఆదాయం
  • n పచ్చదనాన్ని పెంచాలి
  • n డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు నిర్మాణాల్లో వేగం పెంచాలి
  • n మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

నిజాంపేట/రామాయంపేట/చిన్నశంకరంపేట: అన్నదాన అభ్యున్నతికే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేట మం డలంతోపాటు నస్కల్‌, నందగోకుల్‌, రాంపూర్‌ గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను ప్రారంభించడంతో పాటు అందులో వానపాములను వదిలి, రూ.22 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. గ్రామ పరిసరాల శుభ్రతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామస్తులు చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. తడి చెత్తలో వానపాములను వదులడం వల్ల వర్మీ కంపోస్టు తయారవుతుందని, దీని వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. ఆగస్టు 15తేదీ లోగా డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాంపూర్‌లో గ్రామ అవసరాలకు కొనుగోలు చేసిన పంచాయతీ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ట్రాక్టర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 

రామాయంపేటలో భూమి పూజ  

రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాథమిక సహకార పరపతి సంఘం అదనపు బిల్డింగ్‌ పైఅం తస్తుకు భూమిపూజ చేసి ఎంపీపీ కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్‌ రైతుల పక్షపాతి అన్నారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా అర్హులైన ప్రతి రైతుకు రుణాలను అందిస్తున్నదన్నారు. రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న సీసీ డ్రేన్‌ ఏర్పాటుకు సంబంధిత మంత్రికి రూ.కోటి మంజూరు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. రూ.కోటితో సీసీ డ్రేన్‌తోపాటు కల్వర్టులు, ఇతర పనులు జరుగుతాయన్నారు. రామాయంపేట బైపాస్‌లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

నిర్వాసితులకు  చెక్కుల అందజేత

చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో కొం డపోచమ్మ కాల్వ భూ నిర్వాసితులకు కామారం గ్రామ శివారులోని 31మంది రైతులకు రూ.కోటి 36లక్షల 32వేల  చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ నీటితో చిన్నశంకరంపేట మండలంలో 19వేల ఎకరాలు భూమి సాగువుతుందన్నారు. కార్యక్రమాల్లో నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ అందె ఇందిర కొండల్‌రెడ్డి, రామయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌ జైరాములు, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు మహమ్మద్‌గౌస్‌, మండల ప్రత్యేకాధికారి రసూల్‌బీ, ఏడీఏ వసంతసుగుణ, మండల ఏవో సతీష్‌, రామయంపేట ఏఎంసీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, నిజాంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ బాపురెడ్డి, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రం, వైస్‌ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, కౌన్సిలర్లు, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, సీఈవో పుట్టి నర్సింహులు, రైతుబంధు సమితి చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సింగిల్‌ విండో చైర్మన్‌ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo