గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jul 12, 2020 , 01:29:54

ముమ్మరంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

 ముమ్మరంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

  •  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు   పోలీసుశాఖ స్పెషల్‌ డ్రైవ్‌
  •  ఇటుక బట్టీలు, మెకానిక్‌ షెడ్లు,  హోటళ్లు, బస్టాండుల్లో తనిఖీలు
  •  జూలై 31 వరకు కొనసాగనున్న కార్యక్రమం

  మెదక్‌ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పజెప్పి వారి జీవితాల్లో వెలుగులు నిం పేందుకు ప్రభుత్వం ఆపరేషన్‌ ముస్కాన్‌-6 కార్యక్రమాన్ని చేపట్టింది. మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌ రెండు డివిజన్లుగా విభజించిన అధికారులు ఇటుక బట్టీలు, మెకానిక్‌ షెడ్లు, హోటళ్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్లు, కిరాణా షాపుల్లో, భిక్షాటన చేసేవారిని, తప్పిపోయిన, అనాథ, వీధి బాలలను గుర్తిస్తున్నారు.  బాల కార్మికులు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెప్పడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఆపరేషన్‌ ము స్కాన్‌, ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఒకటో తేదీ (బుధవారం) నుంచి ఆపరేషన్‌ ముస్కాన్‌-6 కార్యక్రమం ప్రారంభమైంది. గత సంవత్సరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు, కార్మిక, వైద్య, యువజన క్రీడలు, విద్యాశాఖలే కాకుండా చైల్డ్‌లైన్‌, ఎన్‌జీవోల సమన్వయంతో ఆపరేషన్‌ ము స్కాన్‌- 5 కార్యక్రమాన్ని చేపట్టారు.    ఈ సంవత్సరం కేవలం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆరేషన్‌ ముస్కాన్‌-6 కార్యక్రమా న్ని చేపట్టి బాల కార్మికులను గుర్తించి ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు పిల్లలను స్టేట్‌హోం, చైల్డ్‌ హోం, బ్రిడ్జి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌-6 జూలై ఒకటో తేదీ ప్రారంభమై 31తేదీ వర కు  బాల కార్మికులను గుర్తించడంతో పాటు వారి కుటుంబ స్థితిగతులను అధ్యయనం చేస్తారు. 

ఆపరేషన్‌ ముస్కాన్‌ ప్రారంభం ఇలా.. 

అనాథలు, తప్పిపోయిన చిన్నారులు, చైల్డ్‌బెగ్గర్స్‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారి ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాన్ని 2015 జనవరి 1న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోడల్‌ ఏజెన్సీగా మిగతా శాఖలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపడుతారు. బాల కార్మికులుగా వివిధ రకాల పనుల్లో ఉన్న వారిని గుర్తించి పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా రూపంలో వచ్చిన నగదును పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తారు. ఆతర్వాత తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని స్కూళ్లలో చేర్పిస్తారు. 


logo