గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jul 10, 2020 , 23:55:58

ఆశ్రమ నిర్వాహకుడిపై కేసు నమోదు

ఆశ్రమ నిర్వాహకుడిపై కేసు నమోదు

దుబ్బాక: దుబ్బాక మండలం చీకోడు శివారులో ఉన్న సాయి సమర్థ ఆశ్రమ నిర్వాహకుడు సమర్థ సాయి అలియాస్‌ రఘు, అతడి శిష్యుడు నరేశ్‌పై 420, 376, 508, 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..చీకోడ్‌ శివారులో 15 ఏండ్ల కింద ఐదెకరాల స్థలంలో సాయి సమర్థ పేరిట రఘు ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఆశ్రమంలో ఆధ్యాత్మిక చింతన పేరిట సమర్థ సాయి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆశ్రమానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. చీకోడు గ్రామానికి చెందిన మహిళ ఆధ్యాతిక కార్యక్రమాలకు ఆశ్రమానికి వచ్చి వెళ్లేది. సదరు మహిళ చీకోడులో సంతోషిమాత ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించింది. స్వామిజీ చేతులమీదుగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని అతడి శిష్యుడు నరేశ్‌ను కోరింది. అదనుగా భావించిన నరేశ్‌ మహిళను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని స్వామిజీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్వామిజీ తన ఆత్మ శిష్యుడు వద్ద ఉందని, శిష్యుడు కోరిక తీర్చితే తన కోరిక తీరినట్లుగా ఉంటుందని మహిళకు సూచించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై స్వామి కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. స్వామిజీ అనుచరుడు నరేశ్‌ను రిమాండ్‌కు తరలించగా, స్వామిజీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. 


logo