మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Jul 10, 2020 , 23:42:30

ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి

ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి

రాళ్లపైనే కాదు.. చెట్ల మీద కూడా గీయవచ్చు అందమైన చిత్రాలు అన్నట్లుగా.. ఎంత అద్భుతంగా చిత్రీకరించారు ఈ దృశ్యాలను. జాతీయ పక్షి నెమలి, చిరుతలు, జింకలు, వివిధ రకాల పక్షులు, అటవీ జంతువులను అచ్చుగుద్దినట్లుగా చెట్లపై దించారు కళాకారులు. మెదక్‌ అటవీశాఖ కార్యాలయ ఆవరణలోని చెట్ల కాండాలపై గీయించిన ఈ చిత్రాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జంతువులు, అటవీ సంపద, ప్రకృతి గొప్పతనం, విశిష్టత, ప్రకృతితో మనిషి మెలగాల్సిన తీరును తెలియజేసేందుకు ఈ చిత్రాలు గీయించినట్లు అటవీ అధికారులు తెలిపారు.- మెదక్‌ ఫొటో గ్రాఫర్‌, నమస్తే తెలంగాణ


logo