బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jul 08, 2020 , 23:08:17

అనారోగ్యంతో మెదక్‌ జిల్లా పోలీసు జాగిలం మృతి

అనారోగ్యంతో మెదక్‌ జిల్లా పోలీసు జాగిలం మృతి

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ట్రాకర్‌ డాగ్‌గా మార్షల్‌ జాగిలం అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం మార్షల్‌ అంత్యక్రియలు నిర్వహించారు. జాగిలం మృతిపై మెదక్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంతాపం తెలిపారు. జర్మన్‌ శపర్డ్‌ జాతికి చెందిన మార్షల్‌ 2011లో జన్మించింది. పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తూ నేరస్తులను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. తొమ్మిదేండ్ల కాలంలో 30 కేసుల్లో నేరస్తులను గుర్తించి అధికారుల మన్ననలు పొంది అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరంగా ఉందని డాగ్‌ హాండ్లెర్‌ బసవరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మార్షల్‌ అంత్యక్రియల్లో ఆర్‌ఐలు హరిలాల్‌, డానియల్‌, కృష్ణ, ఆర్‌ఎస్సై హనుమంతరెడ్డి, డాగ్‌ హాండ్లెర్స్‌ జగదీశ్వర్‌, హనుమంతు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.logo