ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 23:42:23

ఈతవనం.. ఘనం

ఈతవనం.. ఘనం

హత్నూర :  సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. ప్రభుత్వం చేపట్టిన మహాకార్యానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుండటంతో నాడు నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి వనాలవలె దర్శనమిస్తున్నాయి. హరితహారంలో  భాగంగా గౌడకులస్తులు ఈత, తాటి మొక్కను నాటి వాటిని సంరక్షించడంతో నేడు అవి ఏపుగా పెరిగి త్వరలోనే స్వచ్ఛమైన కల్లును అందించే విధంగా ఉండటంతో గౌడన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల  పరిధిలోని హత్నూర గ్రామ శివారులో ఇటికాల వీరాగౌడ్‌ తనకున్న వ్యవసాయ క్షేత్రంలో నాలుగు గుంటల భూమిలో రెండోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా రెండువందల ఈత మొక్కలను నాటాడు. అందులో అరవై మొక్కలు చనిపోగా, 140 ఈత మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం నాటికి ఈత చెట్లు స్వచ్చమైన కల్లును అందిస్తాయని వీరాగౌడ్‌ తెలిపారు. logo