బుధవారం 12 ఆగస్టు 2020
Medak - Jul 07, 2020 , 23:40:35

హరిత ‘లక్ష్యం' లక్షా 30 వేల మొక్కలు

హరిత ‘లక్ష్యం'  లక్షా 30 వేల మొక్కలు

మనోహరాబాద్‌ :  మనోహరాబాద్‌ మండలంలో ఐదు విడుతలుగా హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. మండలంలోని దండుపల్లి నుంచి రంగాయిపల్లి వెళ్లే దారిలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మనోహరాబాద్‌ మార్కెట్‌ వద్ద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్షా 30వేల మొక్కలను నాటి వాటిని సంరక్షించే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధిహామీ కూలీలతో మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వించారు. నర్సరీల్లో సైతం హరితహారం కార్యక్రమానికి అవసరమయ్యే రకరకాల మొక్కలు సిద్ధంగా ఉంచారు. 


logo