గురువారం 13 ఆగస్టు 2020
Medak - Jul 07, 2020 , 23:11:40

రైతులను సంఘటితం చేయడానికే రైతు వేదికలు

రైతులను సంఘటితం చేయడానికే రైతు వేదికలు

చిన్నశంకరంపేట/పాపన్నపేట/మెదక్‌ రూరల్‌ : రైతులను సంఘటితం చేసేందుకే సీఎం కేసీఆర్‌ రైతు వేదికలను నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మడూర్‌ గ్రామంలో రైతు వేదికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. జిల్లాకు 75 రైతు వేదికల భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. నిర్మాణ పనులు ఆగస్టు  15లోగా పూర్తి చేయాలని సూచించారు. పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి, మిన్పూర్‌ గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్తపల్లిలో డంపింగ్‌యార్డు, పంచాయతీ కార్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించి, వయోవృద్ధులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. మిన్పూర్‌లో డంపింగ్‌యార్డు పనులు ప్రారంభించి, మొక్కలు నాటారు. కొత్తపల్లిలో గ్రామస్తులు ముందుకొచ్చి సొంత ఖర్చులతో గ్రంథాలయం  ఏర్పా టు చేసుకునేలా కృషి చేసిన సర్పంచ్‌ కుమ్మరి జగన్‌ను ఎమ్మెల్యే అభినందించారు. మెదక్‌ మండలంలోని మంబోజిపల్లిలో నిర్మించిన డంపింగ్‌యార్డును కలెక్టర్‌ ధర్మారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమున జయరాంరెడ్డి, సర్పంచ్‌ ప్రభాకర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మహిళలకు కలెక్టర్‌ మొక్కలను పంపిణీ చేశారు. గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించే మార్కెట్‌ కాంప్లెక్స్‌, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండేలా డంపింగ్‌యార్డుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. ఆయా కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు తాడేపు సోములు, వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాంనాయక్‌, ఎంపీపీ భాగ్యలక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవోలు లక్ష్మణమూర్తి, రాంబాబు, ఏవో శ్రీనివాస్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు గడీల శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ షర్మిలారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు త్యార్ల రమేశ్‌ పాల్గొన్నారు. 

హవేళిఘనపూర్‌ మండలం బూర్గుపల్లిలో..

హవేళిఘణపూర్‌ : ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ ఆవరణలో కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇండ్ల ఎదుట మొక్కలు నాటి సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జడ్పీటీసీ సుజాత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ చెన్నాగౌడ్‌, ఎంపీటీసీ అర్చన శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మెదక్‌ మండల అధ్యక్షుడు అంజాగౌడ్‌, యామిరెడ్డి, సాయాగౌడ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo