ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 02:20:46

నడవలేని వారికి ఇంటి వద్దకే.. వైద్యసేవలు

నడవలేని వారికి ఇంటి వద్దకే.. వైద్యసేవలు

  • జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు  l తూప్రాన్‌లో ఆలనా వైద్యసేవలు ప్రారంభం

తూప్రాన్‌ రూరల్‌ :  కదలలేని వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలనా (తెలంగాణ ప్యాలియేటివ్‌ హోంకేర్‌) సేవలు అందించనున్నట్లు మెదక్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంలోని 50 పడకల సామాజిక దవాఖానలో సోమవారం  డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో అరుణశ్రీ, సామాజిక దవాఖాన డాక్టర్‌ అమర్‌సింగ్‌, పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావనతో కలిసి ఆయన ఆలనా సేవలు ప్రారంభించారు.  డివిజన్‌ పరిధిలోని తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగ్‌, వెల్దుర్తితో పాటు శివ్వంపేట మండలాలకు  ఈ వాహనంలో వెళ్లి  వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అయితే వ్యాధిగ్రస్తుల వివరాల సమాచారం ముందే సేకరించి, 15 రోజులకొక్కసారి వారి వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, పీహెచ్‌ఎన్‌ సం పతి, సామాజిక, పీహెచ్‌సీ దవాఖాన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


logo