సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 02:20:45

వివిధ రకాల మొక్కలు నాటాలి

వివిధ రకాల మొక్కలు నాటాలి

  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

చిన్నకోడూరు :  రంగనాయకసాగర్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్శించేలా విభిన్న రకాల మొక్కలు నాటి పెంచాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో  ఇరిగేషన్‌, అటవీ, ఉద్యానవన, డీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమీక్షించారు.  బండ్‌, రోడ్డు మధ్యన 106 ఎకరాల్లో పండ్లు, పూల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బ్లాకుల వారీగా పండ్ల మొక్కలు నాటాలన్నారు. డ్రిప్‌ పద్ధతిన సంరక్షణ చేపట్టాలని, ఆరు రకాల మొక్కలు నాటేలా  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి, సపోట, నిమ్మ తదితర మొక్కలు రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో మరోసారి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.  సమీక్షలో అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఆర్డీవో అనంతరెడ్డి, ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి, డీఎఫ్‌వో శ్రీధర్‌, డీపీవో సురేశ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, ఏపీడీ కౌసల్య, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. 


logo