మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Jul 01, 2020 , 03:29:01

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి

  • l 85 శాతం మొక్కలను కాపాడాల్సిన బాధ్యత మనందరిది
  • l వార్డుకు ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి
  • l ప్రతి రోజూ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి
  • l మెదక్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : ఆరో విడుత హరితహారంలో భాగంగా మెదక్‌ మున్సిపాలిటీలో పచ్చదనం పెంపొందించాలని, దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం మెదక్‌ మున్సిపల్‌ సాధారణ సర్వసభ్య సమావేశం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల భారత్‌-చైనా సరిహద్దుల్లో అమరవీరులైన భారత్‌ జవాన్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులపై ఉందన్నారు. హరితహారంలో అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ మూడు సంవత్సరాలకు పైబడిన మొక్కలను నాటాలని వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ప్లాస్టిక్‌ ట్రీ గార్డులు ఏర్పాటు చేసేవారమని, ప్రస్తుతం ఇనుప ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా నీళ్లు లేకపోతే ప్రభుత్వం మున్సిపాలిటీకి ఇచ్చిన ట్రాక్టర్‌ ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోయాలన్నారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకుని  మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు కలుపు తీయడం వంటి పనులు చేయించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కమిషనర్‌ శ్రీహరి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.logo