గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 01, 2020 , 03:28:59

పీఆర్‌సీ అమలుకు హామీ

పీఆర్‌సీ అమలుకు హామీ

  • l నిస్వార్థ సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు
  • l ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

హుస్నాబాద్‌: ప్రజలకు, విద్యార్థులకు నిస్వార్థంగా సేవలు చేసినప్పుడే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లోని పీఆర్‌టీయూ కార్యాలయంలో జరిగిన స్కూల్‌ అసిస్టెంట్‌ పూల ఈశ్వర్‌రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ పీఆర్‌సీ అమలుకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన పదవీవిరమణ పొందుతున్న ఈశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి, బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విలేకరి రామకృష్ణ, బీజేపీ నాయకుడు అశోక్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహేందర్‌ల తండ్రి కొత్తపల్లి మొగిలయ్య మృతి చెందగా వారిని ఎమ్మెల్సీ పరామర్శించారు. 


logo