సోమవారం 06 జూలై 2020
Medak - Jun 30, 2020 , 02:36:26

డంపింగ్ యార్డులను త్వరితగతిన పూర్తిచేయాలి

డంపింగ్ యార్డులను త్వరితగతిన పూర్తిచేయాలి

  • సమీక్ష సమావేశంలో  ఎమ్మెల్యే పద్మాదేవేందర్

మెదక్/చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో డంపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధిహామీ పథకం అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందంజలో ఉంచాల్సిన బాధ్యత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. మెదక్ జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు సమష్టిగా కృషిచేయాలని అధికారులను కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేయాలన్నారు. మెదక్ నియోజకవర్గంలో డం పింగ్ యార్డులు, వైకుంఠధామాలు, రైతు నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ నిర్మాణాలు పూర్తి కాలేదని, ఈ విషయంలో  అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించాలన్నారు.  గ్రా మాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైకుంఠధామాల పనులు ప్రారంభించని సర్పంచ్ ఎమ్మెల్యే ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ తడి, పొడి చెత్త(సెగిగ్రేషన్) విషయంలో మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా వ్యాప్తంగా డంపింగ్ జూలై 7వ తేదీ నాటికి, జూలై 30వ తేదీలోగా వైకుంఠధామాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాల పనులు ప్రారంభించని సర్పంచ్ నోటీసులు జారీ చేయాలని డీపీవో హనోక్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 469 పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి, సూరా రం గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారం మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ జిల్లాకు 75 రైతు వేదికలు మంజూరయ్యాయని తెలిపారు. వీటి నిర్మాణాలు ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని సూచించారు. రైతులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. 

 టీఆర్ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే  

మెదక్ పట్టణంలోని అవుసులపల్లి శివారులో గల నూతనంగా నిర్మిస్తున్న జిల్లా టీఆర్ భవనాన్ని  ఎమ్మెల్యే పరిశీలించారు. భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. జూలై చివరి వారంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నట్లు తెలిపారు.  


logo