మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 30, 2020 , 02:36:17

వర్షానందం..

వర్షానందం..

  • ఝరాసంగం : అలుగు పారుతున్న జీర్లపల్లి చెరువు  

ఉమ్మడి మెదక్ జిల్లా నెట్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో రైతన్నలు సంబురపడుతున్నారు. భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ఆరుతడి పంటలకు మేలు చేకూరుతుందని ఆనందపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సిర్గాపూర్, నాగల్ మునిపల్లి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, గుమ్మడిదల మండలాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నల్లవాగు, నారింజవాగు జలకళను సంతరించుకోగా సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతున్నది. వాగుల పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు, చెక్ వరద నీటితో కళకళలాడుతున్నాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఓ మోస్తరు వర్షం కురువగా, సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది.


logo