మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 28, 2020 , 23:36:52

దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు

దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు

పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గాభవానీమాతను ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. భక్తులు అధికారుల సూచనల మేరకు భౌతి క దూరం పాటిస్తూ, శానిటైజర్‌ ఉపయోగిస్తూ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.   

‘మల్లన్న’ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.  భక్తులు ఆలయ సిబ్బంది శానిటైజర్లు, ధర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షలు నిర్వహించారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, ఏఈవోలు రావుల సూదర్శన్‌, గంగా శ్రీనివాస్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు తీసుకున్నారు.

మెదక్‌ చర్చిలో ప్రార్థనలు 

మెదక్‌ టౌన్‌: ప్రభువు నుంచి పొందిన ప్రేమను లోకానికి పంచాలని మెదక్‌ బిషప్‌ రెవరెండ్‌ ఏసీ సాలోమాన్‌రాజ్‌ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో ప్రధాన గురువులు ప్రార్థనలు చేశారు. భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షలు నిర్వహించి, మాస్క్‌లు ధరించిన వారిని  చర్చిలోనికి అనుమతించారు. భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మెదక్‌ సీఎస్‌ఐ చర్చి ప్రెసిబిటర్‌ ఇన్‌చార్జి  ప్రేమ్‌సుకుమార్‌, మత గురువులు విజయ్‌ కుమార్‌, దయానంద్‌, రాజశేఖర్‌, ఐవన్‌ అనుగ్రహంలు పాల్గొని భక్తులను ఆశీర్వదించారు. 


logo