శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jun 28, 2020 , 01:17:46

రైతుల అభ్యున్నతికే రైతు వేదికలు

రైతుల అభ్యున్నతికే రైతు వేదికలు

  • ఎమ్మెల్యే భూపాల్

కల్హేర్ : రైతుల అభ్యున్నతికే రైతు వేదికల నిర్మాణాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే భూపాల్ అన్నారు. శనివారం కృష్ణాపూర్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. ప్రాధాన్యత పంటలను సాగు చేసి లాభాలను పొందాలని రైతులకు సూచించారు. ప్రతి పల్లెలో మొక్కలను నాటి పచ్చని పల్లెగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఏడీఏ కరుణాకర్ కృష్ణపూర్, సర్పంచ్ కిష్టారెడ్డి, శ్రావణ్ ఏవో శశాంక్, ఏఈవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. logo