బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jun 28, 2020 , 01:11:08

నారింజ ప్రాజెక్టు పూడికతీత పనులు పూర్తి చేయండి

నారింజ ప్రాజెక్టు పూడికతీత	పనులు పూర్తి చేయండి

  • రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలి
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
  • నీటిపారుదల శాఖ అధికారులకు సూచన

జహీరాబాద్ : ‘నారింజ ప్రాజెక్టు పూడిక తీత పనులు వేగవంతం చేయండి.. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేసి, వరద నీరు వృథాకాకుండా నిల్వ చేయాలి’ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కోత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టు పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రంజోల్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, 30 గుంటల భూమిని అప్పగించాలని జహీరాబాద్ తహసీల్దార్ నాగేశ్వర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి, పీఆర్ ఏఈ కోటేశ్వర్ ఏఈవో ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 

రాయికోడ్ మండలంలో..   

రాయికోడ్ : మండలంలోని శంశొద్దీన్ మహిబాత్ గ్రామాల్లోని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల వద్దకు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు వేయాలని తహసీల్దార్ రాజయ్యను ఆదేశించారు.  కలెక్టర్ వెంట ఇన్ ఎంపీడీవో ప్రభాకర్ తహసీల్దార్ రాజయ్య, అధికారులు సురేశ్, వరప్రసాద్, విష్ణు, గణపతి, రాజేందర్, అమూల్య, సర్పంచ్ నర్సింహులు, నాగమ్మ తదితరులు ఉన్నారు. 


logo