గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jun 25, 2020 , 23:54:08

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మెదక్‌: ‘హరిత’ తెలంగాణ కోసమే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అన్నారు. పట్టణంలోని 4వార్డు హౌసింగ్‌బోర్డులో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌తో కలసి ప్రారంభించారు. గురువారం పట్టణంలోని 1, 2, 3, 5వ వార్డుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 3లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు కిషోర్‌, విశ్వం, నర్మద, ఆరేళ్ల గాయత్రి, రుక్మిణి, ఆంజనేయులు, లక్ష్మీనారాయణగౌడ్‌, జయరాజు, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌, ప్రధానకార్యదర్శి కృష్ణాగౌడ్‌ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరి బాధ్యత అని పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. విజయ డెయిరీ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో జూనియర్‌ మేనేజర్‌ స్వామి, వైష్ణవి, సౌజన్య, విష్ణుప్రియ, బీఎంసీ సూపర్‌వైజర్లు బాబు, లక్ష్మణ్‌, రమేశ్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన జిల్లా విద్యాధికారి

మెదక్‌ రూరల్‌: మండల పరిధిలోని మక్తభూపతిపూర్‌లోని జడ్పీ హెచ్‌ఎస్‌లో జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌, మండల విద్యాధికారి నీలకంఠంతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్‌తో పాటు గ్రామ పంచాయతీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యార్థులు పాల్గొన్నారు. 

ర్యాలమడుగు, చిట్యాల గ్రామాల్లో..

మండల పరిధిలోని ర్యాలమడుగు, చిట్యాల గ్రామాల్లో ఎంపీడీవో రాంబాబు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి ఎంపీపీ యమున జయరాంరెఢ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో ఆదినారాయణ పాల్గొన్నారు. 

నాటిన మొక్కలను సంరక్షించాలి

హవేళిఘనపూర్‌: మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి అన్నారు. మండల పరిధిలోని తొగుట గ్రామంలో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుజాతశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్‌, ఏపీవో రాజ్‌కుమార్‌, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, సర్పంచ్‌ మంద శ్రీహరి, టీఆర్‌ఎస్‌ నాయకుడు నరేందర్‌రెడ్డి ఉన్నారు. 

పెద్దశంకరంపేటలో..

పెద్దశంకరంపేట : పెద్దశంకరంపేట, చీలపల్లి, ఆరెపల్లి, జంబికుంట, కమలాపురంలో ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ విజయరామరాజులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సత్యనారాయణ, రాములు, రుక్మిణి, సాయిలు, ఎంపీటీసీ సుభాశ్‌గౌడ్‌, రాజేశ్‌, దామోదర్‌, మాణిక్‌రెడ్డి, ఎంపీడీవో రాజమల్లయ్య, ఏపీవో సుధాకర్‌, పీఆర్‌ ఏఈ మొగులయ్య ఉన్నారు.

నర్సరీల్లో మొక్కలు సిద్ధం 

అల్లాదుర్గం: అల్లాదుర్గం ఒద్దుపోతన వద్ద  జడ్పీటీసీ సౌందర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటడానికి కావల్సిన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. బహిరన్‌దిబ్బలో వైస్‌ ఎంపీపీ స్వరూప మొక్కను నాటారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, ఎంపీటీసీ దశరథ్‌, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఏపీవో పుణ్యదాస్‌, ఉప సర్పంచ్‌ నర్సప్ప పాల్గొన్నారు.

టేక్మాల్‌ మండలంలో..

టేక్మాల్‌: మండల పరిధిలోని టేక్మాల్‌ సర్పంచ్‌ సుప్రజా భాస్కర్‌ ఆధ్వర్యంలో కుడి చెరువు కట్టపై మొక్కలను నాటారు. తంపులూర్‌ గ్రామంలో సర్పంచ్‌ సంగయ్య, కోరంపల్లిలో సర్పంచ్‌ శ్రీనివాస్‌, వెంకటాపూర్‌లో సర్పంచ్‌ లచ్చాగౌడ్‌, పల్వంచలో సర్పంచ్‌ శివకుమార్‌, ధనూరలో సర్పంచ్‌ గౌతమ్‌, కుసంగిలో సర్పంచ్‌ ఆబేదాబేగం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సరోజ, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు యూసుఫ్‌, ఎంపీపీ స్వప్న, ఎంపీడీవో హిరణ్మయి ఉన్నారు.

రేగోడ్‌లో..

రేగోడ్‌: మండల పరిధిలోని రేగోడ్‌లో తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో లక్ష్మి మొక్కలను నాటారు. కొండాపూర్‌, టి.లింగంపల్లి, సిందోల్‌, ఆర్‌.ఇటిక్యాల, కొత్వాన్‌పల్లి, మర్పల్లి, సంగమేశ్వర్‌తండాలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఎంపీవో లచ్చాలు, డాక్టర్‌ సబిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, ఎంపీపీ సరోజన, వైస్‌ ఎంపీపీ వినీల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్‌, సర్పంచ్‌లు నర్సింహులు, తుకారాం, రమేశ్‌, మంజుల, సుమంత, రవీందర్‌, అనిత, సిద్దారెడ్డి, ఎంపీటీసీ నర్సింహులు, ఉపాధిహామీ ఏపీవో జగన్మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు.  

పాపన్నపేటలో..

పాపన్నపేట: పాపన్నపేటలో ఎంపీపీ చందనరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు, షర్మిలారెడ్డి మొక్కలు నాటారు. పాపన్నపేట సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, రైతుబంధు సమితి నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుపాయల ఆలయ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బాలరాజ్‌, తహసీల్దార్‌ బలరాం, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు గౌస్‌పాషా, కార్యదర్శి రాకేశ్‌ పాల్గొన్నారు.

చిన్నశంకరంపేటలో..

చిన్నశంకరంపేట: మండలంలోని కొర్విపల్లిలో జడ్పీటీసీ పట్లోరి మాధవి మొక్కను నాటారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద స్పెషల్‌ ఆఫీసర్‌ అశోక్‌కుమార్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తి మొక్కలు నాటారు.


logo