శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jun 25, 2020 , 02:45:51

3.31లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం..

3.31లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం..

మెదక్‌ : మెదక్‌ మున్సిపాలిటీలో ఆరో విడుత హరితహారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ గురువారం నుంచి ఆరో విడుత హరతహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మెదక్‌ మున్సిపల్‌ పరిధిలోని 32 వార్డుల్లో మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. ఒక్కో వార్డుకు అధికారికి హరితహారం బాధ్యతలను అప్పగించినట్టు చెప్పారు.   అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు, యువజన సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.

3.31లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం..

ఆరో విడుత హరితహారంలో భాగంగా మెదక్‌ మున్సిపాలిటీలో 3.31లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13, 14, 29, 30వ వార్డుల్లో  మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈత, తాటి మొక్కలతో పాటు పండ్లు, పూల మొక్కలు, జామ, మామిడి, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, బత్తాయి లాంటి మొక్కలను నాటనున్నామని చెప్పారు. 

ప్రజలు భాగస్వాములు కావాలి 

అన్ని వార్డుల్లో మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. హరితహారంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టలు, ఖాళీ స్థలాలు తదితర చోట్ల నాటేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.