శుక్రవారం 30 అక్టోబర్ 2020
Medak - Jun 22, 2020 , 23:15:28

గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవు

 గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవు

  •  ఎమ్మెల్యే  పద్మా దేవేందర్‌రెడ్డి

పాపన్నపేట : గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు.  సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్‌, ఎంకేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు.   తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌ యార్డులకు తరలించేలా చూడాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు.  సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధ్ది కోసం  విశేషంగా కృషి  చేస్తున్నారని, తడి పొడి చెత్తను వేరు చేసి  సేంద్రియ ఎరువులుగా వాడుకోవచ్చన్నారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, అంతే శుభ్రంగా గ్రామాలను ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందనరెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు బుజ్జమ్మ, మల్లేశం, వెంకట్‌రాములు, ప్రమీలా, ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి,  నాయకులు సొంగ దుర్గయ్య, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.