సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 00:36:58

భారీ వర్షం.. రోడ్లు జలమయం

భారీ వర్షం..  రోడ్లు జలమయం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల మంగళవారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమై ఓ మోస్త్తరు వర్షం కురిసింది. హుస్నాబాద్‌ పట్టణంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. అక్కన్నపేట, మల్లెచెట్టు చౌరస్తాలు వర్షపు నీటితో నిండిపోయాయి. మెయిన్‌రోడ్డులోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మెదక్‌లో భారీ వర్షం కురిసింది. రాందాస్‌ చౌరస్తా జల దిగ్బంధమైంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రేగోడ్‌, టేక్మాల్‌, సద్దిపేటలో మోస్తరు వర్షం కురిసింది.  

-హుస్నాబాద్‌/సిద్దిపేట కలెక్టరేట్‌/మెదక్‌ రూరల్‌/టేక్మాల్‌/రేగోడ్‌


logo