సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 08, 2020 , 00:11:05

జోరుగా పల్లెప్రగతి పనులు

జోరుగా పల్లెప్రగతి పనులు

ఊరూరా పారిశుధ్య పనులు

పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు 

శుభ్రతను పాటించాలని అధికారులు, నాయకుల సూచనలు

సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో ఆదివారం పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఇండ్లు, పరిసరాలు, రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ఆదివారం శుభ్రం చేశారు. కార్యక్రమంలో  యువకులు, మహిళలు పాల్గొన్నారు.

మహ్మదాబాద్‌, ఖాజీపేట్‌, తుల్జారాంపేట్‌ గ్రామాల్లో

నర్సాపూర్‌ రూరల్‌: మహ్మదాబాద్‌, ఖాజీపేట్‌, తుల్జారాంపేట్‌ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాన్ని గుర్తించి మొరం పోశారు. మూసాపేట్‌, ఆద్మాపూర్‌, చిప్పల్‌తుర్తి గ్రామాల్లోనూ రోడ్లను శుభ్రపరిచారు. నత్నాయిపల్లిలో పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డుమెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెద్దచింతకుంటలో

నర్సాపూర్‌ రూరల్‌: మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలో సర్పంచ్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శివకుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామంలో పారిశుధ్య పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నాగరాజు, కార్యదర్శి రవీందర్‌ గౌడ్‌, వినాయక యూత్‌ ప్రెసిడెంట్‌ రాజు,  యువసేన యూత్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌, యూత్‌ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

జోరుగా పారిశుధ్య పనులు

కొల్చారం: కిష్టాపూర్‌లో సర్పంచ్‌ గోదావరి, రాంపూర్‌లో సర్పంచ్‌ రాంరెడ్డి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అంసాన్‌పల్లిలో వాటర్‌ట్యాంక్‌ల చుట్టూ పంచాయతీ కార్యదర్శి నరేందర్‌ బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. కొల్చారంలో సర్పం చ్‌ ఉమ, వార్డు సభ్యులు కృష్ణ పారిశుధ్య పనులను చేయిస్తున్నారు.

‘పల్లెప్రగతి’ పనుల పరిశీలన

నిజాంపేట: మండలంలోని చల్మెడ గ్రా మాన్ని ఆదివారం విజిలెన్స్‌ అధికారి శ్రీహరి సందర్శించి, పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ మురుగు కాల్వలు, డంపింగ్‌యార్డు ప్రాంతాల్లో  నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అధికారి శ్రీహరి మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇంటి వద్ద ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లను నిర్మించుకోవాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్‌ రమేశ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

జెడ్చెరువు తండాలో పల్లెప్రగతి పనుల్లో భాగంగా సర్పంచ్‌ అరుణ్‌కుమార్‌ గ్రామస్తులు, పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రామపంచాయతీ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి రోడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేశారు.

వార్డుల్లో పరిసరాల పరిశుభ్రత

రామాయంపేట: మున్సిపల్‌ వార్డులను చెత్తలేకుండా శుభ్రంగా ఉంచాలని  రామాయంపేట మున్సిపల్‌ కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ దేమె యాదగిరి అన్నారు. ఆదివారం 6, 8, 2 వార్డుల్లో పర్యటించిన కమిషనర్‌ పారిశుధ్య కార్మికులు మురుగు కాల్వల్లో చెత్తలేకుండా తీసివేయాలన్నారు.   

చేగుంటలో... 

చేగుంట:పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చిన్నశివునూర్‌ పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ కొఠారి అశోక్‌ నాటిన మొక్కల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను ఆదివారం తొలగించి గుంతలు ఏర్పాటు చేశారు. చందాయిపేట సర్పంచ్‌ బుడ్డ స్వర్ణలత మురుగు కాల్వల చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు.


logo