ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 08, 2020 , 00:10:54

మల్కాపూర్‌ మహాఅద్భుతం

మల్కాపూర్‌ మహాఅద్భుతం

ఇన్‌కంట్యాక్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుధాకర్‌ నాయక్‌ 

తూప్రాన్‌ రూరల్‌ : మల్కాపూర్‌లో జరిగిన అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని, ఇక్కడి రైతులు, యువకులను ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని ఇన్‌కంట్యాక్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుధాకర్‌నాయక్‌ అన్నారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ ఆదర్శ గ్రామాన్ని ఆదివారం సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం గొగ్గులూర్‌ పంచాయతీ పాలకమండలి సభ్యులతో కలిసి సందర్శించారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటి పరిసరాలు, రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లను చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. గ్రామ శివారులోని మహిళా రైతులు సేద్యం చేస్తు న్న పందిరిసాగును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం  డంపింగ్‌యార్డుకు తరలించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, తడి, పొడి చెత్తతో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దత్తత తీసుకున్న గొగ్గులూర్‌ను సైతం మల్కాపూర్‌ తరహాలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆంజఆంజనేయులుగౌడ్‌, మన్నెనవీన్‌, పిట్లచంద్రంతోపాటు మేక్‌ఇన్‌ మల్కాపూర్‌యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.


logo