గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 07, 2020 , 00:07:24

గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌కు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌కు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

గజ్వేల్‌ అర్బన్‌ :  గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌గా ఇటీవల  నియమితులైన మాదాసు  అన్నపూర్ణ పలువురు ప్రజాప్రతినిధులను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌  ఎర్రొళ్ల శ్రీనివాస్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లును శనివారం హైదరాబాద్‌లోని వారి కార్యాలయాల్లో పాలకవర్గంతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  మంత్రి హరీశ్‌రావు ఆమెకు అభినందనలు తెలిపారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ కాంతారావునూ పాలకవర్గం కలిసి కృతజ్ఞతలు తెలిపింది. వారి వెంట స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం తదితరులు ఉన్నారు.


logo