సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 06, 2020 , 23:54:24

శనిగరం ప్రాజెక్టులో ఈతకెళ్లి ఇద్దరి దుర్మరణం

శనిగరం ప్రాజెక్టులో ఈతకెళ్లి ఇద్దరి దుర్మరణం

గజ ఈతగాళ్లతో గాలింపు ..  మిన్నంటిన రోదనలు

కోహెడ మండలం శనిగరంలో విషాదం

చుట్టపు చూపుకోసం వచ్చిన ఇద్దరు శని వారం కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈతకెళ్లి మృతిచెందారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా, ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు దొరికాయి. ఈత రాని అనిల్‌(17)ను కాపాడబోయే క్రమంలో అతని బాబాయి కుమార్‌(27) మునిగిపోగా, గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి.  ఘటనా స్థలాన్ని ఏసీపీ మహేందర్‌ సందర్శించి, వివరాలు సేకరించారు.

కోహెడ: శనిగరం ప్రాజెక్టులో శనివారం ఈతకు వెళ్లి ఇద్దరు  మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరిగొట్టి పద్మ తన అక్క కొడుకు బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన పొన్నాల అనిల్‌ (17), తన మరిది కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం రంగపేటకు చెందిన నంగునూరు కుమార్‌   శనిగరంలోని పద్మ ఇంటికి శనివారం వచ్చారు. సరదాగా శనిగరం ప్రాజెక్టులోకి ఈతకు వెళ్లారు. అనిల్‌కు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అనిల్‌ను కాపాడేందుకు కుమార్‌ ప్రయత్నించగా భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోయారు. చుట్టుపక్కల వారు సర్పంచ్‌ కర్ర జయశ్రీకి సమాచార అందించారు. జాలర్లు, గజ ఈతగాళ్లు ప్రాజెక్టులో గాలించగా అనిల్‌ మృతదేహం లభించింది. కుమార్‌ మృతదేహం లభ్యం కాలేదు. కుమార్‌కు భార్య మంజుల, కూతురు రోహిత ఉన్నారు.  హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హుస్నాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  

ఈతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు : హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌

ఈతరాని వారు ఈతకు వెళ్లి తమ ప్రాణాలను పోగొట్టుకోవద్దని హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ అన్నారు. శనిగరం ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారన్నారు. 


logo